ABOUT
నేటి యువతరమా! నేను మోటారు సైకిల్ ని నాదొక విన్నపం నీ మనస్స్సులో నాకు స్థానాన్ని కల్పిస్తావా!
నీ గమ్య స్థానాన్ని సులభామయం చేస్తా,
దినదినము నీ ఆర్ధిక ఆదాయాన్ని తగ్గిస్తానీ అవసరాన్ని ఆసరాగా చేసుకొని నీలో సోమరిథాన్ని పెంచి నీ ఆరోగ్యాన్నికి హాని కల్గిస్తా
అంతే కాదు నేస్తమా నీ చుట్టూ ఉండే ఇతరుల ఆరోగ్యానికి కుడా హాని కలిగిస్తా.సిశాన్ని విరజల్లుతో భూమిని వేడెక్కించి ప్రకృతి విపత్హులను సృస్టిస్తా
అంతే కాదు నేస్తమా విపరీతమైన చలిని సృష్టించి నేను నీ వారిని అంతం చేస్తా
ఇదే నా లక్ష్యం
నా లక్ష్యాన్ని నెరవేర్చటం నీకు ఇష్టమేన అయితే నా గురించి ఒక్కసారి ఆలోచించు
నేటి యువతరమా!
పర్యావరణ పరిరక్షణ నవ యువత విద్యార్థులు సమితి.Rg.no 111/2014 .ధర్మవరం.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క విద్యార్ధి భాద్యత .మేం చేస్తున్న ఈ కార్యక్రమం స్వచ్చంద కార్యక్రమం.ఈ సంస్థ కేవలం ఓకే ప్రోఫిసేర్ మరియు కొంతమంది విద్యార్థుల చేస్తున్న స్వచ్చంద కార్యక్రమం ఈ విద్యార్థులు పర్యావరణం ను పరిరక్షించాలన్న ఉద్దేశంతో మరియు కాలుష్యాన్ని నివారించాలన్న ద్యేయంతో గత సంవత్సరం నుండి చేస్తున్నము ఈ కార్యక్రమానికి ఎవిదమైనటువంటి రాజకీయ సహకారం కాని ఇతరుల సహకారం కాని లేదు ,కాని ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు నడిపిస్తున్నారు.
ప్రతి ఒక్క విద్యార్ధి భాద్యత కాబట్టి ప్రతి ఒక్క విద్యార్ధి ఈ పర్యావరణం ను కాపాడాలని కోరుతున్నాం .మేం చేసే ఈ కార్యక్రమం ను పాటశాలల యందు దేవస్థానాల యందు నాటడం జరుగుతోంది.అలాగే పట్టణాలలోను పల్లెలలోను ఇంటింటా మొక్కలు పంపిణి చేయబడును.
విద్యార్థులు ఎవరైనా ఆసక్తి కల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహాయ సహకారాలను చేయాలని ఆశిస్తున్నాము.భాగస్వామ్యులు కావాలనుకున్న వారు ఈ సెల్ no.కు కాల్ చేయగలరు.
ప్రెసిడెంట్ :డి.ఆదినారాయణ(లెక్చరర్)సెల్ no.8142741096 సెక్రెటరీ :టి.రేవన్ కుమార్(విద్యార్ధి)సెల్.no.8096462002 సభ్యుడు :g.పురుషోత్తం(విద్యార్ధి)సెల్ no.7799155314
GMAIL ID :ppnyvs2014@gmail.com
No comments:
Post a Comment